బన్నీ సునామీ..సరైనోడు @ రూ. 20 కోట్లు

653
allu arjun
- Advertisement -

సినిమా సినిమాకి వైవిధ్యాన్ని ప్రదర్శిస్తున్న టాలీవుడ్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ మరో కొత్త రికార్డును క్రియేట్ చేశారు. యు ట్యూబ్‌లో బన్నీ సినిమాలు సరికొత్త రికార్డు సృష్టిస్తున్నాయి. అల్లు అర్జున్ నటించిన హిట్ సినిమాలు సరైనోడు,డీజే(దువ్వాడ జగన్నాథం) కోట్ల వ్యూస్‌ను రాబట్టాయి.

సరైనోడు సినిమా 20 కోట్ల వ్యూస్‌ను సొంతం చేసుకోగా డీజే మూవీని 15 కోట్ల మందికిపైగా చూశారు. తొలుత ఈ రెండు సినిమాల డబ్బింగ్‌ వెర్షన్‌ను కొన్ని కారణాల వల్ల యూట్యూబ్‌ తొలగించింది. దీంతో గత ఏడాది మళ్లీ అప్‌లోడ్‌ చేశారు. అయినా సరే ఈ రెండు చిత్రాలు అత్యధిక వ్యూస్‌తో దూసుకుపోతున్నాయి.

డీజే సినిమాను కూడా రీ-అప్‌లోడ్‌ చేశాక.. ఏడాదిలో 15.2 కోట్ల వ్యూస్‌ను దక్కించుకుంది. ఈ రెండు సినిమాలు యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్‌ సాధించిన భారత్‌ చిత్రాలుగా నిలిచాయి. ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు అల్లు అర్జున్‌. భవిష్యత్‌లో మరిన్ని మంచి చిత్రాలతో ముందుకువస్తానని ట్వీట్‌లో పేర్కొన్నారు బన్నీ.

- Advertisement -