పాకిస్థాన్ నెటిజెన్‌కి కేటీఆర్‌ చురక ..

300
ktr twitter

బీజేపీ సీనియర్ నేత,ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సుష్మాస్వరాజ్ హఠాన్మరణంపై ఓ పాకిస్ధాన్ నెటిజన్ చేసిన కామెంట్‌పై తీవ్రంగా మండిపడ్డారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సుష్మాస్వరాజ్ మరణంపై మీరు చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు. మీ వక్ర బుద్ధికి ఈ కామెంట్ అద్దం పడుతోందని మండిపడ్డారు.

మీ ప్రొఫైల్ పిక్ చూస్తుంటే పాకిస్థాన్ కు చెందినవారిలా ఉన్నారని…జీవితాంతం ప్రజాసేవలో ఉన్న సుష్మాస్వరాజ్ లాంటి వారిని గౌరవించడానికి మీరు కొంత ధైర్యాన్ని సంపాదించుకోగలని చురకలంటించారు.

తెలంగాణ ప్రజలు సుష్మా స్వరాజ్‌ని మర్చిపోరని…ఆమెకు నివాళులు అర్పిస్తూ ఉదయం ట్వీట్ చేశారు కేటీఆర్‌. ఈ ట్వీట్‌కు పాకిస్థాన్‌కు చెందిన షోయబ్ అన్సారీ రిప్లై ఇచ్చారు. కశ్మీర్ విషయంలో భారత ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగానే సుష్మా చనిపోయారని… ఆమె కోసం నరకం ఎదురు చూస్తోందని ట్వీట్ చేశాడు. ఈ నేపథ్యంలో కేటీఆర్‌….షోయబ్‌కు చురకలంటించారు.