25 ఏళ్లకే మంత్రి…తెలంగాణ చిన్నమ్మగా గుర్తింపు

491
sushma dance
- Advertisement -

బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్‌(67) మరణ వార్త యావత్‌ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆమె ఆకస్మిక మృతికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ, పలువురు రాజకీయ నాయకులు ట్విటర్‌ వేదికగా సంతాపం తెలియజేశారు.

క్రమశిక్షణ కలిగిన బీజేపీ నేతగా సిద్దాంత విషయంలో రాజీలేని పోరాటం చేశారు సుష్మా. 1970ల్లోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆమె.. 1977లో హర్యానా కేబినెట్ మంత్రిగా ఎన్నికయ్యారు. దేశంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన మంత్రిగా ఆమె గుర్తింపు పొందారు.

తెలంగాణతోనూ సుష్మా స్వరాజ్‌కు ప్రత్యేక అనుబంధం ఉంది. తెలంగాణ ఉద్యమం సమయంలో ఆమె పార్లమెంట్‌లో తెలంగాణ గొంతుకను బలంగా వినిపించారు. 2017 చివర్లో జరిగిన పారిశ్రామిక వేత్తల సదస్సులో మాట్లాడిన ఆమె.. నేను మీ తెలంగాణ చిన్నమ్మను అనగానే సభ చప్పట్లతో మార్మోగింది.

ఇందిరా గాంధీ తర్వాత విదేశాంగ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన రెండో మహిళగా ఆమె రికార్డు క్రియేట్ చేశారు. ఢిల్లీకి తొలి మహిళా సీఎంగా పనిచేశారు సుష్మా. విదేశాంగ మంత్రిగా ఆమె విశేష సేవలు అందించారు. ఆ పదవికి ఆమె వన్నె తీసుకొచ్చారు. విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను తిరిగి వెనక్కి రప్పించడంలో, పాకిస్థానీయులకు మెడికల్ వీసాలు అందజేయడంలో ఆమె చొరవ చూపారు.

- Advertisement -