టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గుత్తా…

1132
gutta sukender reddy
- Advertisement -

టీఆర్ఎస్ సీనియర్ నేత,రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు గుత్తా సుఖేందర్ రెడ్డికి గుడ్ న్యూస్ అందించారు సీఎం కేసీఆర్. శాసనసభ్యుల కోటాలో జరిగే ఎమ్మెల్సీ స్థానానికి టిఆర్ఎస్ అభ్యర్థిగా గుత్తా సుఖేందర్ రెడ్డి పేరును ఖరారు చేశారు.

పార్టీ తరుఫున నామినేషన్ వేయాల్సిందిగా గుత్తాను సిఎంను కోరారు. ఈ నేపథ్యంలో ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రిని కలిసి గుత్తా కృతజ్ఞతలు తెలిపారు. నామినేషన్ల పత్రాల దాఖలు తదితర ప్రక్రియలను నిర్వహించడంలో సహకరించాలని ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డిని సిఎం ఆదేశించారు.

నల్గొండ జిల్లాకు చెందిన గుత్తా రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేయడమే కాదు పార్టీలో సీనియర్ నేతగా ఉన్నారు. జిల్లా రాజకీయాలపై మంచిపట్టుంది. అంతేగాదు సీఎం కేసీఆర్‌కి అత్యంత సన్నిహితుడు. అందుకే ఆయన్ని రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా సైతం నియమించారు సీఎం.

ఎమ్మెల్సీ యాదవరెడ్డిపై అనర్హత వేటు పడటంతో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్ధానం ఖాళీ అయింది. ఇక ఈ నెల 7న నోటిఫికేషన్‌ జారీ చేయనుండగా అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలవుతుంది. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ ఈ నెల 14. నామినేషన్‌ పత్రాలను 16న పరిశీలిస్తారు. ఉపసంహరణకు 19వ తేదీ వరకు గడువిచ్చారు. ఎన్నికలు అవసరమైతే 26న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్‌ జరుగుతుంది. అసెంబ్లీలో మెజార్టీ బలం ఉండటంతో గుత్తా ఎన్నిక లాంఛనమే కానుంది.

- Advertisement -