ఓ హిందీ వార్త పత్రికపై ఆగ్రహం వ్యక్తం చేశారు బాలీవుడ్ నటి ఊర్వశి రౌతెల. తన మాజీ ప్రియుడు హర్దిక్ పాండ్య సాయాన్ని కోరిన ఊర్వశి అనే వార్త కథనాన్ని ప్రచురించింది. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో వెంటనే స్పందించింది ఊర్వశి.
దయ చేసి చెత్త వార్తలని ప్రచురించొద్దని స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. ఇలాంటి వార్తల వలన కుటుంబంలో గొడవలు వస్తాయని..ఏదైన జరిగితే తన కుటుంబానికి జవాబు చెప్పుకోలేను అని పేర్కొంది.
గ్రేట్ గ్రాండ్ మస్తీ , భాగ్ జానీ, హేట్ స్టోరీ వంటి చిత్రాలలోను నటించి పాపులర్ అయింది ఊర్వశీ . ఇటీవల అండమాన్ నికోబార్ ఐలాండ్ ప్రభుత్వం ఈ అమ్మడికి ప్రత్యేక గౌరవాన్ని అందించింది. ఐలాండ్‌లోని ఓ పుష్పానికి ఊర్వశీ రౌతెలా పేరు పెట్టింది. గతంలో పలు పార్టీలకు పాండ్య, ఊర్వశి కలిసే వెళ్లేవారు. దాంతో వారు డేటింగ్లో ఉన్నారన్న వార్తలు ప్రచురితమయ్యాయి.