జైపాల్ రెడ్డి మృతి పట్ల ఉభయసభల్లో సంతాపం

324
Jaipal Reddya
- Advertisement -

మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సూదీని జైపాల్ రెడ్డి మృతి చెందిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన మృతి పట్ల నేడు ఉభయసభల్లో సంతాపం ప్రకటించారు. ఆయన మృతి పట్ల సభ్యులు నివాళులర్పించారు. రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య నాయుడు సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈసందర్భంగా ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.

జైపాల్‌ రెడ్డితో తనకున్న 40 ఏళ్ల అనుబంధాన్ని వెంకయ్య గుర్తు చేసుకున్నారు. తామిద్దరం ఒకేసారి అసెంబ్లీకి ఎన్నికైనట్లు చెప్పారు. కేంద్రమంత్రిగా ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారని చెప్పారు. జైపాల్ రెడ్డి మృతి తెలంగాణకు తీరని లోటని చెప్పారు.

- Advertisement -