- Advertisement -
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్‌నేత జైపాల్‌రెడ్డి(77) మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవీ జైపాల్ రెడ్డి మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాజకీయ దురంధురుడు,మేధావి,జ్ఞాని అయిన జయపాల్ రెడ్డి మరణం నన్ను దిగ్బ్రాంతికి గురిచేసిందన్నారు చిరు.
దేశ రాజకీయాల్లో అయన ప్రభావం చూపిన ప్రజ్ఞాశాలి.అయన వాగ్ధాటి, రాజకీయ పరిజ్ఞానం నన్ను అయన పట్ల గౌరవాన్ని పెంచింది, అభిమానపాత్రుడ్ని చేసింది. ఆయన మరణం కాంగ్రెస్‌కి తీరని లోటు. అయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడ్ని కోరుకొంటూ .. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను.
- Advertisement -