కర్ణాటక స్పీకర్ సంచలన నిర్ణయం

274
Karnataka Speaker
- Advertisement -

కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిన సంగతి తెలిసిందే. బీజేపీ నేత యడ్యూరప్ప కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ముఖ్యమంత్రి యడ్యూరప్ప బలపరీక్షకు ముందురోజు అసెంబ్లీ స్పీకర్‌ రమేష్‌కుమార్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. గత వారం ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిన ఆయన.. ఇవాళ మరో 14 మందిని బర్త్‌రఫ్‌ చేస్తున్నట్టు ప్రకటించారు.

వీరిలో 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలుకాగా, మిగతా వారు జేడీఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో మొత్తం కర్ణాటకలో 17మందిన డిస్ క్వాలిఫై చేశారు. రెబెల్‌ ఎమ్మెల్యేలను రేపటి నుంచి శాసనసభకు అనుమతించబోమని రమేష్‌కుమార్‌ స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల డిస్ క్వాలిఫికేషన్ ను స్వయంగా మీడియా ముందు ప్రకటించిన రమేశ్ కుమార్, స్పీకర్ గా తాను రాజీనామా చేయబోనని స్పష్టం చేశారు.

- Advertisement -