పొంగిపొర్లుతున్న బోగత జలపాతం

718
bogatha
- Advertisement -

సహజసౌందర్యంతో చూపరులను కట్టిపడేసే ప్రకృతి అందాల్లో ఈ ‘జలపాతం’ ఒకటి. కొడకోనల నుంచి జాలువారే నీటిపొంగు ప్రతిఒక్కరని ఇట్టే కటిపడేస్తుంది. అక్కడి వాతావరణాన్ని ఎంతో రమణీయంగా మార్చేసి, పర్యాటకుల్ని తమవైపుకు ఆకర్షించుకుంటుంది ఈ జలపాతం. అదే  జయశంకర్ భూపాలపల్లి జిల్లా వాజేడు మండలంలోని బోగత జలపాతం. ఇటీవల కురిసిన వర్షాలకు జాలువారుతూ సందర్శకుల మనసు దోచుకుంటున్నది.

ఛత్తీస్‌గఢ్ గుట్టలు, పెనుగోలు నల్లందేవి వాగు, పాలవాగు గుట్టలపై నుంచి వస్తున్న వరద నీరు భారీగా చేరి అందాలతో పర్యాటకులను కట్టిపడేస్తోంది. నింగి నుంచి నేలకు జాలువారిన పాల సంద్రంలా మారిన బొగత జలపాతం వరద నీటితో కళకళలాడుతూ పర్యటకులను ఆక‌ర్షిస్తోంది.

రాష్ట్ర నలుమూలల నుంచి బొగత జలపాతానికి పర్యాటకులు తరలి వచ్చి సందడి చేశారు. బొగత వద్ద స్విమ్మింగ్ పూల్‌లో పర్యాటకులు సెల్ఫీలు దిగుతూ, స్నానాలు చేస్తూ సందడి చేశారు.

- Advertisement -