- Advertisement -
కర్ణాటక స్పీకర్ రమేష్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. విశ్వాసపరీక్ష జరిగిన రెండు రోజుల తర్వాత ముగ్గురు రెబల్ ఎమ్మెల్యేలపై వేటు వేశారు. ఎమ్మెల్యేలు ఆర్ శంకర్,రమేష్ జార్జిహోళీ,మహేష్ కుమాటల్లిలను అనర్హులుగా ప్రకటిస్తూ కన్నడరాజకీయాల్లో సంచలనం సృష్టించారు.
పార్టీ ఫిరాయింపుల చట్టంలోని పదో షెడ్యూల్ ప్రకారం వారిపై అనర్హత వేటు వేసినట్టు ప్రకటించారు స్పీకర్. ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించడమే కాదు.. వారు 2023 వరకు పోటీచేయడానికి వీలులేకుండా అనర్హత వేటు వేశారు.
13 మంది కాంగ్రెస్, ముగ్గురు జేడీఎస్ ఎమ్మెల్యేలు కుమారస్వామి ప్రభుత్వానికి రెబల్స్‌గా మారారు. వారిని బుజ్జగించేందుకు చేసిన ప్రయత్నాలన్ని విఫలమయ్యాయి. దీంతో ఎట్టకేలకు జరిగిన విశ్వాసపరీక్షలో కుమారస్వామి ఓడిపోయారు. దీంతో జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ సర్కార్ కూలిపోయింది.
- Advertisement -