రానా కిడ్నీ మార్పిడి సక్సెస్..!

528
rana kidney operation
- Advertisement -

హీరో రానా కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌ సక్సెస్ అయింది. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న రానాకు ఆయన తల్లి లక్ష్మి కిడ్ని దానం చేశారు. దీంతో ఆపరేషన్ సక్సెసయింది.

బాహుబలి షూటింగ్ సమయంలో రానాకు కిడ్నీ సమస్య తలెత్తిందని సమాచారం. అప్పటినుంచి ముంబైలోని ఓ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఇటీవలి కాలంలో సమస్య తీవ్రం కావడంతో కిడ్నీ మార్పిడి ఒక్కటే సమస్యకు పరిష్కారమని డాక్టర్లు సూచించారు. దీంతో యుఎస్‌కు వెళ్లి శస్త్ర చికిత్స చేయించుకున్నారు రానా.

రానాతో పాటు ఆయన తల్లి లక్ష్మి, చెల్లెలు మాళవిక యూఎస్‌లోనే ఉంటున్నారు. ప్రస్తుతం రానాకు నెల రోజుల విశ్రాంతి అవసరమని తెలిపిన వైద్యులు తెలిపారు. నెల రోజుల తర్వాత రానా విరాటపర్వం షూటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉంది.

- Advertisement -