రజనీకాంత్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం దర్బార్. రజనీకాంత్ సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తోండగా లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. చాలాకాలం తర్వాత పోలీస్ ఆఫీసర్‌గా ఈ సినిమాలో రజనీ కనిపిస్తుండగా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకురానుంది.
ప్రస్తుతం శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా సినిమాలో రజనీ లుక్‌కి సంబంధించిన పిక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోలీస్ ఆఫీసర్ గెటప్ లో రజినీకాంత్ సూపర్బ్ గా ఉన్నారు. గడ్డం లుక్,హెయిర్ స్టైల్ చూస్తుంటే మరో 30 ఏళ్ళు వెనక్కి వెళ్లినట్టు కనిపిస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ లోకేషన్స్ నుండి ఫోటోలు ఇలా లీక్ కావడం ఇదేమీ మొదటిసారి కాదు. గతంలో కూడా రజనీ,నయనతార ఉన్న ఫోటోలు లీకయ్యాయి. సినిమాకు సంబంధించి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ లీక్స్ బెడద ‘దర్బార్’ టీమ్‌ని ఇబ్బందులకు గురిచేస్తూనే ఉంది.