- Advertisement -
ఈ నెల 24న టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పుట్టిన రోజు జరుపుకోనున్నారు. అయితే కేటీఆర్ జన్మదినాన్న పురస్కరించుకుని ఆయన అభిమానులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ తలసాని సాయి కిరణ్ యాదవ్ కొంత మంది అంధులకు సాయం అందించనున్నారు.
సాయి కిరణ్ ఆధ్వర్యంలో ఉదయం 10.30 గంటలకు సికింద్రాబాద్ పికెట్‌లో గల ఉపకార్-స్వీకార్ బధిరుల ఆశ్రమ పాఠశాలలో వినికిడి లోపంతో బాధపడుతున్న 10 మంది విద్యార్థులకు చెవిటి మిషన్లు పంపిణీ చేస్తారు. మధ్యాహ్నం 12.00 బేగంపేటలోని ప్రకాష్ నగర్లో గల అంధుల పాఠశాలలో సాయిబాబా గౌడ్ కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు.
- Advertisement -