చరిత్రలో ఈ రోజు : నవంబర్ 22

286
today-in-history
today-in-history
- Advertisement -

{{నవంబర్ 22, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 326వ రోజు (లీపు సంవత్సరములో 327వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 39 రోజులు మిగిలినవి.}}

*సంఘటనలు*
1956: 16వ వేసవి ఒలింపిక్ క్రీడలు మెల్బోర్న్లో ప్రారంభమయ్యాయి.
1965: ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యు.ఎన్.డి.పి (యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం – ఐక్యరాజ్యసమితి ఆభివృద్ధి కార్యక్రమం ప్రారంభమైనది.
1968: మద్రాసు రాష్ట్రం పేరును తమిళనాడుగా మార్చే బిల్లును లోక్‌సభ ఆమోదించింది.
1980: భారత లోక్‌సభ స్పీకర్‌గా బలరామ్ జక్కర్ పదవిని స్వీకరించాడు.
1988: బాబా ఆమ్టేకు ఐరాస మానవహక్కుల సంఘం పురస్కారం లభించింది.
1997: హైదరాబాదులో ఇండో అరబ్ సాంస్కృతిక కేంద్రానికి పాలస్తీనా నేత యాస్సిర్ ఆరాఫత్ శంకుస్థాపన చేసాడు.

*జననాలు*
1830: ఝల్కారీబాయి, ఝాన్సీ లక్ష్మీబాయి పరాక్రమాన్ని తలపించే అరుదైన చరిత్రకు ప్రతీక దళిత సిపాయి వీరనారి. (మ.1858)
1907: లక్కోజు సంజీవరాయశర్మ, ప్రపంచంలో ఆరు వేల గణితావధానాలు చేసిన ఏకైక వ్యక్తి. (మ.1997)
1913: ఎల్.కె.ఝా, భారత దేశపు ఆర్థిక వేత్త మరియు భారతీయ రిజర్వ్ బాంక్ గవర్నర్ గా పనిచేసిన 8 వ వ్యక్తి. (మ.1988)
1933: నీరుకొండ హనుమంతరావు, ఖమ్మం జిల్లాకు చెందిన కవి. (మ.2016)
1967: బోరిస్ బెకర్, జర్మనీకి చెందిన ఒక మాజీ ప్రపంచ నం. 1 టెన్నిస్ క్రీడాకారుడు.
1970: మర్వన్ ఆటపట్టు, శ్రీలంకకు చెందిన మాజీ క్రికెట్ కెప్టెన్.

*మరణాలు*
1963: జాన్ ఎఫ్ కెనడి, అమెరికా సంయుక్త రాష్ట్రాలకు 35వ అధ్యక్షుడు. (జ.1917)
2006: అసీమా చటర్జీ, ప్రముఖ భారతీయ మహిళా రసాయన శాస్త్రవేత్త. (జ.1917)

- Advertisement -