తెలంగాణలో ప్రజాపంపిణి విధానం చాలా బాగుందిః కర్ణాటక ఫుడ్ కమిషన్

310
civil supply corporation
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పంపిణి విధానం చాలా బాగుందన్నారు కర్ణాటక ఫుడ్ కమిషన్ అధికారులు. బాగుందని, ముఖ్యంగా రేషన్‌ సరకులును తరలించే వాహనాలు పక్కదారి పట్టకుండా వాటికి జీపీఎస్‌ యంత్రాలను అమర్చి వాటి ప్రతి కదలికలను ప్రత్యక్షంగా తెలుసుకునేలా కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఏర్పాటు అద్భుతం అని కొనియాడారు.

civi

తెలంగాణ ప్రజాపంపిణీ విధానాలను పరిశీలించేందుకు కర్ణాటక ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ శ్రీ కృష్ణమూర్తి, సభ్యులు శ్రీ కసిబిన్‌, శ్రీమతి మంజూలాబాయి తదితరులు బుధవారం నాడు పౌరసరఫరాల భవన్‌లో పౌరసరఫరాల కమిషనర్‌ శ్రీ అకున్‌ సబర్వాల్‌తో సమావేశం అయ్యారు.

telanaga corporation

ఈసమావేశంలో తెలంగాణ ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ శ్రీ తిరుమలరెడ్డి, సభ్యులు శ్రీ ఆనంద్‌, శ్రీ సంగులాల్‌, శ్రీమతి భారతి, శ్రీ గోవర్దన్‌రెడ్డి, శ్రీమతి శారద పలువురు పాల్గోన్నారు. ఈ సందర్భంగా కర్ణాటక ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ శ్రీ కృష్ణమూర్తి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపంపిణీ ద్వారా అర్హులకే రేషన్‌ సరుకులు చేరేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం చాలా బాగుందని అన్నారు.

అలాగే కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌, వేలిముద్రలతో రేషన్‌ పంపిణీ (ఈపాస్‌ విధానం), వేలిముద్రలు అరిగిపోయిన వారికి అసౌకర్యం కలగకుండా ఐరిస్‌ ద్వారా సరుకులు అందించే ప్రక్రియ, టి-రేషన్‌ యాప్‌, పోర్టబిలిటీ, గోదాముల్లో సీసీ కెమెరాలు, రేషన్‌ సరుకులు పక్కదారి పట్టకుండా వాహనాలకు జీపీఎస్‌ యంత్రాలతో అనుసంధానం చేయడం చాలా అభినందనీయమని అన్నారు.

- Advertisement -