దర్శకుడు పూరీ జగన్నాథ్, హీరో రామ్ కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ ఇస్మార్ట్ శంకర్. నభా నటేశ్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించిన ఈచిత్రాన్ని పూరీ తన సొంత బ్యానర్ లో తెరకెక్కించారు. ఇప్పటికే ఈసినిమా నుంచి విడుదలైన ట్రైలర్, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది.
ఈనెల 18న ప్రపంచవ్యాప్తంగా ఈసినిమా విడుదల కానుంది. దీంతో తాజాగా ఈమూవీ సెన్సార్ ను కూడా పూర్తి చేసుకోగా..సెన్సార్ సభ్యులు ఈమూవీకి పూర్తీగా A సర్టీఫికేట్ ను ఇచ్చారు. సినిమాలో చిన్నారులు చూసేందుకు అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
ఇక ఈవిషయంపై ట్వీట్టర్ లో స్పందించారు హీరో రామ్. పొగతాగడం, మద్యం సేవించడంతో పాటు ‘ఇస్మార్ శంకర్’లా నిజజీవితంలో వ్యవహరించటం ఆరోగ్యానికి హానికరం. ‘ఇస్మార్ట్ శంకర్’ ఓ కల్పిత పాత్ర అనే తెలుసుకునేలా ‘ఇస్మార్ట్’గా వ్యవహరించండి అని తెలిపాడు. పూరీ గతంలో దర్శకత్వం వహించిన పోకిరి, దేశముదురు, పోకిరి సినిమాలకు కూడా A సర్టిఫికేట్ వచ్చింది. దీంతో ఆ సినిమాలు భారీ విజయాన్ని సాధించాయి. ఈసినిమా కూడా భారీ విజయాన్ని సాధిస్తుందని నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్.