- Advertisement -
108 అంబులెన్స్ వాహనంలో ఓ మహిళ ప్రసవం కావడంతో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ పరిధిలోని కవిత అనే మహిళకు పురిటినొప్పులు రావడంతో ఆమె బంధువులు 108కు కాల్ చేశారు.
అయితే 108 వెళ్లే సరికి రక్తం మడుగులో పడి ఉంది. కవిత దీంతో హైదరాబాద్ బాపుఘాట్ వద్ద రోడ్డు పక్కన డెలివరీ చేశారు 108 సిబ్బంది. అప్పటికప్పుడు డెలివరీ చేసి తల్లి,బిడ్డను కాపాడారు. కవిత పండంటి మగబిడ్డకు జన్మనివ్వగా ప్రస్తుతం కార్వాన్ ప్రభుత్వ ఆస్పత్రిలో తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు.
- Advertisement -