తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అటవీశాఖ ఆధ్వర్యంలో.. అటవీశాఖలో దేశ వ్యాప్తంగా తీసుకుంటున్న వినూత్న కార్యక్రమాలు, ఆవిష్కరణలపై రెండు రోజుల వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్ర ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ అటవీ సంరక్షణ ప్రధాన అధికారులు (PccF), వివిధ రాష్ట్రాలకు చెందిన ఐఎప్ఎస్ అధికారులు పాల్గొన్నారు.
పీకే జా ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ తెలంగాణ మాట్లాడుతూ.. ఫారెస్ట్ అధికారులపై దాడులను ఖండిస్తున్నాము. అడవుల ప్రాముఖ్యత ప్రజలు అర్ధం చేసుకోవాలి.అధికారులపై దాడులు బాధాకరమన్నారు. ఫారెస్ట్ అధికారిపై జరిగిన దాడి ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరిగింది.ఫారెస్ట్ అధికారుల ఉద్యోగాలు చాలా ఇబ్బందులతో కూడినవి.మాకు ఆయుధాలు ఉండవు.అడవులపై ప్రజలకు చైతన్యం అవసరం.
ఇకపై దాడులు జరక్కుండా చర్యలు తీసుకుంటామని పీకే జా అన్నారు. వన్ ఫోర్త్ ల్యాండ్ ఫారెస్ట్ ఉంది. వన్య జీవుల రక్షణ కూడా జరుగుతుంది. ఏయే రాష్ట్రాల్లో అడవుల పరిరక్షణకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు. తలెత్తుతున్న సమస్యలపై చర్చించాం. అక్టోబర్ నెలలో మహారాష్ట్రలో ఫారెస్ట్ వర్క్ షాప్ జరగనుందని ఆయన తెలిపారు.