పంజాబ్ కాంగ్రెస్‌లో కలకలం..!

371
- Advertisement -

భారత జట్టు మాజీ క్రికెటర్‌, పంజాబ్‌ కాంగ్రెస్‌ నేత నవజ్యోత్‌సింగ్‌ సిద్ధూ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి రాసిన లేఖను ట్వీటర్‌లో పంచుకున్నారు. అయితే ఈ రాజీనామాను ఎందుకు సమర్పించారన్న విషయమై సిద్ధూ స్పష్టత ఇవ్వలేదు.

Sidhu

2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ దేశవ్యాప్తంగా 52 లోక్ సభ స్థానాలకు పరిమితమైన సంగతి తెలిసిందే. అయితే పంజాబ్ లోని 13 లోక్ సభ స్థానాలకు గానూ కాంగ్రెస్ 8 చోట్ల విజయం సాధించింది. మరోవైపు శిరోమణి అకాళీదళ్(4), ఆప్ పార్టీ ఓ చోట విజయం సాధించాయి.

అయితే పట్టణ ప్రాంతాల్లో సిద్ధూ సరిగ్గా ప్రచారం నిర్వహించకపోవడం వల్లే మిగిలిన సీట్లను కోల్పోయామని ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ అప్పట్లో విమర్శలు గుప్పించారు. దీంతో సిద్ధూ, అమరీందర్ సింగ్ మధ్య విభేదాలు తలెత్తాయి. అప్పటినుంచి ఇద్దరి మధ్య దూరం పెరగడంతో అమరీందర్ సింగ్ కేబినెట్ నుంచి సిద్ధూ తప్పుకున్నట్లు రాజకీయవర్గాల సమాచారం.

- Advertisement -