స్మార్ట్‌గా హైదరాబాద్:సీఎస్ జోషి

419
cs joshi
- Advertisement -

సాలీడ్ వేస్ట్ మేనేజ్ మెంట్, బయోమెడికల్ వేస్ట్, నదుల కాలుష్యం, ఎయిర్ పొల్యూషన్, స్యాండ్ మైనింగ్ తదితర అంశాలకు సంబంధించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలకు అనుగుణంగా జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేసి జిల్లా ప్రణాళికలను రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

గురువారం సచివాలయంలో OA నెంబర్ 606/2018 నకు సంబంధించి NGT జారీ చేసిన ఉత్తర్వుల అమలుపై సి.యస్ జిల్లా కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సి.యస్ మాట్లాడుతూ NGT ఉత్తర్వుల ప్రకారం సాలీడ్ వేస్ట్ మేనేజ్ మెంట్, నదులు, వాయుకాల్యుష్యం, బయోమెడికల్ వేస్ట్ తదితర అంశాలపై జిల్లా కమిటీలు ప్రతినెల సమావేశమై మినెట్స్ ను పంపడంతో పాటు త్రైమాసిక నివేదికలను ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశించారు.

సాలీడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ కు సంబంధించి జిహెచ్ఎంసి జీడిమెట్లలో ఏర్పాటు చేసిన ప్లాంటును రాష్ట్రంలో ఉన్న మున్సిపల్ కమిషనర్లకు చూపించాలని అన్నారు. పట్టణ, గ్రామాలకు డంపింగ్ యార్డులు ఉండేలా తగు చర్యలు చేపట్టాలని అన్నారు. చెత్తను సేకరించే వారికి తడి, పొడి చెత్త వేరు చేయడంపై హౌజ్ హోల్డ్స్(House holds) ను చైతన్యం చేసేలా జిల్లా స్ధాయిలో శిక్షణా కార్యక్రమాలు చేపట్టాలని, చెత్త సేకరణకు అవసరమైన ఆటోలు, రిక్షాలు సమకూర్చుకోవాలని సీఎస్ తెలపారు.సాలీడ్ వేస్ట్ కు సంబంధించి జిహెచ్ఎంసి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్, కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్, సిద్దిపేట, సిరిసిల్ల, బోడుప్పల్ మున్సిపాలిటీలతో పాటు ప్రతి జిల్లాలో 3 గ్రామాలలో పూర్తి స్ధాయిలో అక్టోబర్ 29 నాటికి అమలు చేసేలా తీసుకుంటున్న చర్యలను సి.యస్ సమీక్షించారు.

డంపింగ్ యార్డ్ ల ఏర్పాటు, చెత్త సేకరణ, ప్రాసెసింగ్, వేరు చేయటం, డిస్పోజల్ తదితర అంశాలపై కలెక్టర్లతో మాట్లాడారు. వివిధ జిల్లాలలో మైనింగ్ అనంతరం వినియోగంలో లేని క్వారీల వివరాలను కలెక్టర్లకు పంపాలని వాటిని ఘన వ్యర్ధాల నిర్వహణకు వినియోగించుకునేలా చూడాలని సి.యస్ అన్నారు. జిల్లాలలో ఈ అంశాలకు సంబంధించి కమిటీ ప్రత్యేక సమావేశం ప్రతినెల నిర్వహించి నివేధికను పిసిబి కు పంపాలన్నారు. బయోమెడికల్ వేస్ట్ కు సంబంధించి రాష్ట్రంలో ఉన్నఆసుపత్రులను 11 ఇన్సులేటరీ యూనిట్స్ కు ట్యాగ్ చేయాలని, రిజిష్టర్ కాని ఆసుపత్రులను రిజిష్టర్ అయ్యేలా చూడాలని సీఎస్‌ అన్నారు.

నదుల పొల్యూషన్ స్ట్రెచెస్ కు సంబంధించి జిల్లాల వారిగా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలని, అక్రమ ఇసుక మైనింగ్, శుద్ధి చేయని వ్యర్ధాలు కలువకుండా చూడాలని కలెక్టర్లను కోరారు, నగరీకరణ, పారిశ్రామికీకరణ తదితర అంశాలను దృష్టిలో ఉంచుకొని వాయుకాలుష్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ అవసరమైన చోట ఎయిర్ క్వాలిటీ స్టేషన్ లను ఏర్పాటు చేయాలన్నారు. ఇసుక మైనింగ్ కు సంబంధించి సైంటిఫిక్ పద్దతిలో చేయాలని అన్నారు. అక్రమ మైనింగ్ జరగకుండా కలెక్టర్లు చూడాలన్నారు.

అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా మాట్లాడుతూ జిల్లా స్ధాయి కమిటీలు నెలవారి సమావేశాలు నిర్వహించాలని త్రైమాసిక నివేధికలలో ఆ పీరియడ్ లో రెగ్యులర్ గా చేపడుతున్న కార్యక్రమాలు, చర్యల వివరాలతో పాటు ఆ పీరియడ్ లో కొత్తగా చేపట్టిన అంశాలను ప్రత్యేకంగా పేర్కొనాలన్నారు. పర్యావరణ పరిరక్షణకు జిల్లాలలో తీసుకున్న చర్యల నివేధికలను క్రోడీకరించి NGT కి సమర్పిస్తామన్నారు. ఈ అంశాలకు సంబంధించి ప్రత్యేక మార్గదర్శకాలను కలెక్టర్లకు పంపుతున్నామన్నారు.ఈ సమావేశంలో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, జిహెచ్ఎంసి కమీషనర్ దానకిషోర్, CBC సెక్రటరీ అనీల్ కుమార్, పంచాయతీ రాజ్ కమీషనర్ నీతూ ప్రసాద్, హైదరాబాద్ కలెక్టర్ మానిక్ రాజ్, TS MDC MD మల్సూర్, మైన్స్ డైరెక్టర్ సుశీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -