14 రోజుల పాటు ఏపీ బడ్జెట్‌ సమావేశాలు..

337
jagan
- Advertisement -

గురువారం ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ఈ నెల 30వ తేదీ వరకూ జరపాలని ఈ రోజు బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. శని, ఆదివారం మినహా మొత్తం 14 పనిదినాలపాటు శాసనసభ జరగనుంది. సభలో ఎల్లుండి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. అదే రోజు వ్యవసాయ బడ్జెట్ మంత్రి కన్నబాబు ప్రవేశపెడతారు.

శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, అసెంబ్లీ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులు చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, మంత్రులు కన్నబాబు, అనిల్‌, టీడీపీ తరఫున అచ్చెన్నాయుడు, రామానాయుడు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -