- Advertisement -
పార్లమెంట్ లో టీఆర్ఎస్ ఎంపీలు సమావేశమయ్యారు. లోక్ సభ , రాజ్యసభల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ మీటింగ్ లో చర్చిస్తున్నారు. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవరావు ఆధ్యర్యంలో జరిగిన ఈసమావేశంలో పలువరు ఎంపీలు పాల్గోన్నారు. ఇటివలే కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సభలో ప్రస్తావించాలని ఈ మీటింగ్ లో నిర్ణయించుకున్నారు.
లోక్ సభ ప్రతిపక్ష నేత నామా నాగేశ్వర్ రావు, ఎంపీ బీజీ పాటిల్ లు కలిసిగట్టుగా రాష్ట్ర సమస్యలపై పోరాడాలని నిర్ణయించారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్ట్ కు జాతీయ హోదా ఇవ్వకపోవడాన్ని కూడా పార్లమెంట్ లో ప్రస్తావించాలని నిర్ణయించుకున్నారు. ఈ మీటింగ్ లో ఎంపీలు నామా నాగేశ్వర్ రావు, బీబీ పాటిల్, కొత్త ప్రభాకర్ రెడ్డి, రంజీత్ రెడ్డి, మాలోతు కవిత, పలువురు ఎంపీలు పాల్గోన్నారు.
- Advertisement -