ధృవకు డేట్‌ ఫిక్స్‌…

240
December 9th release for Ram Charan's Dhruva
December 9th release for Ram Charan's Dhruva
- Advertisement -

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, ర‌కూల్ ప్రీత్ సింగ్ జంట‌గా, సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో గీతాఆర్ట్స్ బ్యాన‌ర్ లో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న ‘ ధృవ’ చిత్ర షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇప్ప‌టికే పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాతలు అల్లు అర‌వింద్‌, ఎన్‌.వి.ప్ర‌సాద్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు ప్రభావం సినిమాలపై బాగానే ఉండడంతో ఈ సినిమా విడుదల డైలామాలో పడింది. అయితే ఈ చిత్రాన్ని తొలుత డిసెంబర్ 2న విడుదల చేయాలనుకున్నారు. పెద్ద నోట్ల రద్దుతో జనంలేక థియేటర్లు ఖాళీగా ఉన్న ఈ పరిస్థితుల్లో ధృవ రిలీజ్ మంచిది కాదని, వాయిదా వేయడమే బెటరని అరవింద్ అనుకుంటున్నాడట. తాజాగా ఈ సినిమాను డిసెంబర్‌ 9న విడుదల చేయనున్నట్టు ధృవ యూనిట్ వెల్లడించింది.

ఈ సందర్భంగా నిర్మాతలు చిత్ర విశేషాలు తెలియజేస్తూ నీతి నిజాయితీలకు కట్టుబడే పోలీస్ అధికారి ధృవకు వృత్తి నిర్వహణలో కొందరు శుత్రువులు ఎదురవుతారు. వారు ఎవరు? ధృవ వారిపై ఎలాంటి పోరాటం సాగించాడు? అనేది ఈ చిత్ర ఇతివృత్తం. సమాజంలో మంచివాడిగా చెలామణి అవుతోన్న అవినీతిపరుడిని అతడు ఎలా ఎదుర్కొన్నాడు అనేది ఆసక్తికరంగా ఉంటుంది.

తమిళంలో విజయవంతమైన తని ఒరువన్ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. అరవింద్‌స్వామి విలన్‌గా కనిపిస్తారు. ఇటీవలే విడుదలైన పాటలకు చక్కటి స్పందన లభిస్తోంది. రామ్‌చరణ్ పాత్ర చిత్రణ శక్తివంతంగా ఉంటుంది. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి అని తెలిపారు. అరవింద్‌స్వామి, నాజర్, పోసాని కృష్ణమురళి, తదితరులు నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ:పి.యస్.వినోద్, సంగీతం:హిప్, హాప్ తమిళ, ప్రొడక్షన్ డిజైనర్:రాజీవన్, ఆర్ట్:నాగేంద్ర, ఎడిటర్:నవీన్‌నూలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్:వి.వై.ప్రవీణ్‌కుమార్.

- Advertisement -