ప్రపంచకప్‌లో టీమిండియా దూసుకెళుతోంది. ఇటు బ్యాటింగ్,బౌలింగ్‌లో రాణించిన భారత బ్యాట్స్‌మెన్ ఆల్ రౌండ్ షోతో విండీస్‌ను మట్టికరిపించారు. భారత్ విధించిన 269 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ ఏ దశలోనూ భారత బౌలర్ల ముందు నిలవలేకపోయింది.
ఇటు షమి.. అటు బుమ్రా.. ఇద్దరూ కట్టుదిట్టమైన బౌలింగ్‌లో విండీస్‌కు ఆరంభంలోనే కళ్లెం వేశారు. గేల్ (6),హోప్ (5),ఆంబ్రిస్ (31), పూరన్ (28) ,బ్రాత్‌వైట్ (1), అలెన్ (0)లను ఔట్ చేసి విండీస్ పతనాన్ని శాసించారు. ఫలితంగా విండీస్ 34.2 ఓవర్లలో 143 రన్స్‌కే కుప్పకూలింది. చాహల్‌కు 2 వికెట్లు దక్కాయి. బ్యాటింగ్‌లో రాణించిన కోహ్లీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.
అంతకముందు టాస్ గెలిచిన భారత్‌కు ఆరంభంలోనే నిరాశ ఎదురైంది. రోహిత్ వెనుదిరిగిన కోహ్లీ వెస్టిండీస్ బౌలర్ల భరతం పట్టారు. విరాట్ కోహ్లీ (82 బంతుల్లో 8 ఫోర్లతో 72), ధోనీ (61 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 56 నాటౌట్ ) అర్ధ సెంచరీలతో సత్తా చాటగా, రాహుల్ (64 ), హార్దిక్ (46) రాణించారు. రోచ్‌కు 3, హోల్డర్, కాట్రెల్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. దీంతో కోహ్లీ సేన సెమీఫైనల్స్‌లో చోటు కోసం మరొక్క పాయింట్ దూరంలోనే ఉంది.