ఇవాళ తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గం సమావేశం ప్రారంభమైంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్యవర్గ సభ్యులు,జడ్పీ చైర్మన్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు, పార్టీ సంస్థాగత నిర్మాణంపై సీఎం కేసీఆర్ చర్చించనున్నారు.
టీఆర్ఎస్ సభ్యత్వ నమోదును సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల బాధ్యులకు అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా పార్టీ సభ్యత్వ పుస్తకాలు అందజేయనున్నారు. తెలంగాణభవన్‌లో ఏర్పాటు చేసిన 11 ప్రత్యేక కౌంటర్లలో సీఎం కేసీఆర్ తోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకుంటారు.
రాష్ట్ర కార్యవర్గం సమావేశం కంటే ముందు సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో ప్రజాప్రతినిధులకు విందు ఇచ్చారు. ఈ విందుకు మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు హాజరయ్యారు. విందు అనంతరం మధ్యాహ్నం తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ పార్టీ సమావేశం ప్రారంభమైంది.