హైదరాబాద్ సెక్రటేరియట్ ప్రాంగణంలో కొత్తభవన నిర్మాణ భూమిపూజ శాస్త్రోక్తంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ముఖ్యమంత్రి కేసీఆర్ పూజా కార్యక్రమాలు నిర్వహించి,మట్టి తవ్వారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రమంత్రులు,ఉన్నతాధికారులు హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు కేటీఆర్,హరీష్ రావు.
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ నాయకులతో పాటు సెక్రటేరియట్ ప్రాంగణానికి వచ్చారు. సీఎం కోసం ఎదురుచూస్తున్న సీఎస్ ఎస్కే జోషి, ఇతర ఉన్నతాధికారులు కేటీఆర్ కు వెల్కమ్ చెప్పారు. అక్కడికి కొంత దూరంలో నిల్చున్న హరీష్ రావును కేటీఆర్ పలకరించారు. వీరిద్దరు కాసేపు ముచ్చటించారు.
సరదాగా నవ్వుతు మాట్లాడుతూ కనిపించారు.ప్రస్తుతం వీరిద్దరి ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్భంగా హరీష్ కనిపించకపోవడంతో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. హరీష్ మాత్రం సిద్దిపేటలో కాళేశ్వరం ప్రారంభోత్సవ సంబరాల్లో పాల్గొని సీఎం కేసీఆర్‌పై ప్రశంసలు గుప్పించారు. అయినా హరీష్‌కు టీఆర్‌ఎస్‌కు గ్యాప్ పెంచేందుకు పలువురు ప్రయత్నించగా తాజాగా సచివాలయం ప్రారంభోత్సవంలో పాల్గొని ఆ రూమర్స్‌కి మరోసారి చెక్ పెట్టారు హరీష్.