- Advertisement -
రాష్ట్ర శాసనసభ ఎదురుగా ఉన్న వృక్షంపై పతంగులు ఎగురవేసే మాంజా కాలికి చుట్టుకొని గద్ద వేలాడుతూ ప్రమాదంలో ఉందనే సమాచారంతో జిహెచ్ఎంసి డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు చేరుకొని ఆ గద్ద ను రక్షించాయి. అసెంబ్లీ ఎదురుగా ఉన్న భారీ వృక్షంపై కాలికి దారం చుట్టుకొని వేలాడుతూ గ్రద్ద ప్రమాదంలో ఉందని అసెంబ్లీ సిబ్బంది జిహెచ్ఎంసి మేనేజ్మెంట్ ఫోర్స్ కు సమాచారం అందించారు.
దీంతో గన్ పార్క్ సమీపంలో విధుల్లో ఉన్న డిఆర్ఎఫ్ సిబ్బంది లాడర్ సహాయంతో ఆ గ్రద్దను సురక్షితంగా కిందికి చేర్చారు. తగు సపర్యలు చేసి తిరిగి వదిలిపెట్టారు. ఇటీవలి కాలంలో నల్లగండ్ల చెరువులో పడ్డ జింకను, ఆల్విన్ కాలనీ ట్యాంక్లో పడ్డ ఆవును రక్షించిన జిహెచ్ఎంసి డిజాస్టర్ rescue బృందాలను అసెంబ్లీ అధికారులు, నగర వాసులు అభినందించారు.
- Advertisement -