కేసీఆర్‌ అధ్యక్షతన టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యవర్గ భేటీ..

279
CM KCR
- Advertisement -

తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యవర్గ భేటీ ప్రారంభమైంది. ఈ భేటీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన కొనసాగుతోంది. ఈ సమావేశంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మినహా కార్యవర్గ సభ్యులంతా పాల్గొన్నారు. దిల్లీలో జరుగుతున్న అఖిలపక్ష సమావేశంలో కేటీఆర్‌ పాల్గొన్నారు. పురపాలక సంఘం ఎన్నికలు, పార్టీ సభ్యత్వ నమోదు, జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణంపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నట్టు సమాచారం.

నిన్న జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో 31 జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణానికి స్థలం కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. పరిషత్‌ ఎన్నికల్లో పార్టీ శ్రేణులన్నీ బాగా పనిచేశాయని కేసీఆర్‌ ప్రశంసించారు. ఈ సమావేశం అనంతరం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ మీడియాతో మాట్లాడనున్నారు.

- Advertisement -