ఈనెల 26 నుండి 28 వరకు హైదరాబాద్ లోని నోవేటల్ లో అంతర్జాతీయ విత్తన కాంగ్రెస్ సమ్మేళనం జరుగుతుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు.మూడేళ్ళకి ఒకసారి జరిగే ఈ సమ్మేళనం ఆసియాలోనే మొదటిసారి అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ సమ్మేళనం జరుగుతుందన్నారు.ముగింపు వేడుకల్లో గవర్నర్ పాల్గొంటారని తెలిపిన మంత్రి ఈ సమావేశంలో 80 దేశాల ప్రతినిధులు పాల్గొంటారని చెప్పారు.
400మంది విదేశీ డెలిగేట్స్ 300 మంది ఇండియన్ డెలిగేట్స్ పాల్గొంటారు.విత్తన పరిశోధన, నాణ్యత లాంటి అంశాల పట్ల ఇక్కడ చర్చిస్తారు.వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధకులు, అన్ని రాష్ట్రాల వ్యవసాయ మంత్రులు పాల్గొంటారు.ఈ సమ్మేళనాన్ని కేంద్ర వ్యవసాయ శాఖామంత్రి ప్రారంభిస్తారని చెప్పారు.విత్తనోత్పత్తికి తెలంగాణ కేంద్ర బిందువు.తెలంగాణలో ఉత్పత్తయిన విత్తనాలు ఏ దేశంలో, ఎలాంటి పరిస్థితుల్లోనైనా పెరిగే అవకాశాలు ఎక్కువ.ఈ అంతర్జాతీయ సమ్మేళనం తర్వాత తెలంగాణ ప్రాంతంలోని విత్తన ఇండస్ట్రీ గ్లోబల్ గా ఎదిగే అవకాశముందన్నారు.
మల్టీ నేషనల్ సీడ్ ఇండస్ట్రీలు తెలంగాణలో వారి యూనిట్స్ నెలకొల్పడానికి ఈ సమ్మేళనం నాందిగా మారుతుందన్నారు.రైతులు తమ వ్యవసాయ నైపుణ్యాలను పెంచుకువడానికి ఎంతగానో దోహదపడుతుందని చెప్పారు.కాళేశ్వరం మొదలయ్యాక…తెలంగాణ రైతులు వర్షాలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదన్నారు.
రెండేళ్ల తర్వాత తెలంగాణ రైతులు తొలకరి కోసం ఆకాశం వైపు చూడాల్సిన పరిస్థితి తొలగిపోతుందన్నారు.తెలంగాణలో వ్యవసాయ ఉత్పత్తి పెరిగిందని చెప్పిన నిరంజన్ రెడ్డి.. రానున్న కాలంలో ఇది మరింత పెరుగుతుందన్నారు.అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తులు ఉండాలనేదే మా లక్ష్యంమని చెప్పారు.

