ఏపీలో పోలీసులకు నేటినుంచి వీక్లి ఆఫ్..

442
ap police
- Advertisement -

ఏపీ సీఎం జగన్‌ అన్నమాట నిలబెట్టుకున్నారు. దశాబ్దాల పోలీసుల కల నెరవేరుస్తూ నేటి నుంచి వీక్లీ ఆఫ్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సర్కార్‌ కానిస్టేబుల్ నుంచి సీఐ వరకు వారంలో ఒకరోజు వీక్లీ ఆఫ్ తీసుకునే వెలుసుబాటు కలిగింది.

వీక్లీ ఆఫ్‌పై ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం మేరకు డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆధ్వర్యంలో చర్చలు జరిపి.. సాధ్యాసాధ్యాలపై కమిటీ నిర్ణయం వచ్చిన తర్వాత క్లారిటీకి వచ్చారు.

వీక్లీ ఆఫ్‌ అమలుకు మొత్తం 19 మోడల్స్ ఎంపిక చేశారు. యూనిట్ ఆఫీసర్లు ఏదో ఒక మోడల్ ని సెలక్ట్ చేసుకోవచ్చంటున్నారు ఉన్నతాధికారులు. అయితే ప్రతి యూనిట్ నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకొని కొన్ని రోజులకి మార్పులు చేర్పులు చేయబోతున్నారు. 70 వేల మంది పోలీసులకి ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ రూపొందించి.. డాష్ బోర్డ్ అమల్లోకి తీసుకురాబోతున్నారు.

వీక్లీ ఆఫ్ లు ఇస్తే సిబ్బంది కొరత సమస్య మరింత పెరుగనుంది. అయితే.. సిబ్బంది కొరత సమస్యను అధిగమించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలపై ఫోకస్ పెట్టారు పోలీసు అధికారులు. ఇప్పటికే విశాఖ, కడప, ప్రకాశం జిల్లాలో ఈ ప్రయోగాత్మకంగా అమలవుతోంది. ఈ విధానంపై అధికారుల ఫీడ్ బ్యాక్ తీసుకుని ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్నారు. ఏళ్లకు ఏళ్లుగా అమలుకు నోచుకొని వీక్లీ ఆఫ్ ఎట్టకేలకు అమలులోకి రావడంతో పోలీసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -