జగ్గారెడ్డికి ఫోన్ చేసిన కోమటిరెడ్డి…బీజేపీలోకి రావాలని పిలుపు

446
komati-reddy-jagga-reddy
- Advertisement -

మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వంలో సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటి చర్యలు తీసుకునేందుకు సిద్దమైంది. కాంగ్రెస్ పార్టీ రియాక్షన్ చూసి తాను నెక్ట్స్ స్టెప్ తీసుకోనున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా ఆయన నేడు ఢిల్లీకి వెళ్లారు. అక్కడ బీజేపీ పెద్దలతో నేడు రాజగోపాల్ రెడ్డి సమావేశం కానున్నారు.

ఇక తనతో పాటు పార్టీలో అసంతృప్తులుగా ఉన్న మరికొంత మంది నేతలను రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి తీసుకెళ్తున్నట్లుగా తెలుస్తుంది. ఇందులో భాగంగా సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి కి కూడా ఫోన్ చేశారట కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. బీజేపీలోకి రావాలని జగ్గారెడ్డిని ఆహ్వానించారని తెలుస్తుంది.

దీంతో జగ్గారెడ్డి కూడా కమలం గూట్లో చేరుతారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. స్వతహాగా హిందూ భావాలు అధికంగా ఉన్న జగ్గారెడ్డి గతంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అక్కడ ఎక్కువ కాలం ఉండలేకపోయిన ఆయన మళ్లీ కాంగ్రెస్‌ గూటికి తిరిగివచ్చారు.

- Advertisement -