తెలంగాణను హరిత తెలంగాణగా మార్చేందుకు సీఎం కేసీఆర్ అవిశ్రాంతంగా కృషిచేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తీసుకువచ్చిన హరితహారం కార్యక్రమంతో రాష్ట్రం ఆకుపచ్చగా మారింది. దాదాపు ఎనిమిదేండ్లలో నాటిన 273.33 కోట్ల మొక్కలతో పచ్చని చెట్లతో చూడముచ్చటగా మారింది. ఇక ఇవాళ 9వ విడత హరితహారం కార్యక్రామానికి శ్రీకారం చుట్టనున్నారు సీఎం కేసీఆర్.
రంగారెడ్డి జిల్లా తుమ్మలూరు అర్బన్ ఫారెస్ట్ పార్కులో ఉదయం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మొక్కను నాటి ప్రారంభించనున్నారు.ఎనమిదేండ్లలో రాష్ట్రంలో ఏర్పాటుచేసిన నర్సరీలు 14,864 కాగా హరితహారం కోసం ఇప్పటివరకు రూ.10,822 కోట్లు ఖర్చు చేసింది ప్రభుత్వం. ప్రభుత్వం చేపట్టిన హరిత సంకల్పంతో 13.44 లక్షల ఎకరాల అటవీ పునరుద్ధరణ కాగా 2.03 లక్షల ఎకరాల్లో ప్లాంటేషన్. 24.53 కోట్ల మొకలు నాటడం జరిగింది.
Also Read:పవన్ కు ప్రాణహాని..రాజకీయ వ్యూహమా?
పునరుద్ధరణ ద్వారా పెరిగిన మొకలు 53.84 కోట్లు కాగా 10,886 కి.మీ. మేర అటవీ ప్రాంతాల చుట్టూ కందకాల తవ్వకం జరిపారు.అగ్ని ప్రమాదాల నివారణ కోసం 21,452 కి.మీ. మేర ఫైర్‌లైన్లు ఏర్పాటుచేశారు. నేల, తేమ పరిరక్షణకు అడవుల్లో నీటి యాజమాన్య పద్ధతుల అమలు చేశారు. అలాగే చెక్ డ్యాములు, ఇంకుడు చెరువులు/ కుంటలు వంటివి నిర్మాణం చేపట్టారు. దీనికి తోడు పట్టణ ప్రాంత అటవీ ఉద్యానవనాలు, హరిత వనాలు నెలకొల్పారు. ఇవాళ రాష్ట్రంలో నర్సరీలేని గ్రామం లేదంటే అతిశయోక్తికాదు.
ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం హరితహారం వల్ల గ్రేటర్ పరిధిలో పదేండ్లలో గ్రీన్ కవర్ భారీగా 147 శాతం పెరిగింది.సుమారు ఏడు కోట్ల మొకలు నాటడంతోపాటు, కొత్తగా 456 కాలనీ పారుల అభివృద్ధి. 1120 కిలో మీటర్ల మేర అవెన్యూ ప్లాంటేషన్, 115 చోట్ల యాదాద్రి మోడల్ లో (మియావాకి) పచ్చదనం పెంపొందించారు.
Also Read:మల్కపేట..రెండో ట్రయల్ రన్ సక్సెస్