వెంకీ చెప్పిన మంచి మాటలు…

199
venkatesh
- Advertisement -

నేడు సమాజంలో యువత చెడు అలవాట్లకు తొందరగా అట్రాక్ట్ అవుతున్నారు. మద్యం సేవించడం,,పొగ త్రాగడం వంటి చెడు వ్యసనాల బారినపడుతున్నారు. వీటిని ఓ స్టైల్‌ గా అలవార్చుకుంటున్నారు. ముఖ్యంగా చాలా మంది యువత తోటి స్నేహితుల ఒత్తిడి కారణంగా చెడు అలవాట్లను నేర్చుకుంటున్నారు. చివరికి వాటికి బానిసలై బంగారు జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఈ విషయంపై అవగాహన కల్పించడానికి ‘టీనేజ్‌ ఫౌండేషన్‌’ అనే సంస్థ ఓ వీడియో రూపంలో మన ముందుకు తీసుకువచ్చింది.

venkatesh

ఇందులో కొన్ని సన్నివేశాలను చూపించి.. వెంకటేశ్‌ ‘పీర్‌ ప్రెజర్‌’ అనే అంశం గురించి మాట్లాడుతూ కనిపించారు. జీవితాన్ని మరొకరి చేతుల్లో పెట్టొద్దు, తోటివారి ఒత్తిడికి లొంగొద్దు అనే చక్కటి సందేశంతో వచ్చిన ఈ వీడియోను వెంకటేశ్‌ సోషల్‌మీడియా ద్వారా షేర్‌ చేశారు.

‘తొలుత ఇవన్నీ(చెడు అలవాట్లు) సరదాగా ఉంటాయి. ఒక్కసారి ప్రయత్నిస్తే తప్పేముంది.. అందరూ చేస్తున్నారుగా.. ఫ్రెండ్స్‌ చెప్పినట్లు చేయకపోతే వాళ్లు నాకు దూరమైపోతారేమో.. ఇలా ఆలోచించి మొదలుపెడతారు. అంతేకానీ దాని వల్ల కలిగే ఫలితాలను ఆలోచించలేరు. మీ స్నేహితులను నిరాశపరచడం ఇష్టంలేక మీ జీవితాలను ప్రమాదంలో పడవేసుకోవడం సబబా? చెడు అలవాట్లకు ఆకర్షితులు కావద్దు.

ఒక్కసారి నో చెప్పండి.. ఆ తర్వాత ఎదుటివారు మీ గురించి ఏం అనుకుంటున్నారనేది అనవసరం. వారు మిమ్మల్ని వదిలేసినా పర్వాలేదు. మీరు, మీ జీవితం మీకు ముఖ్యమని తెలుసుకోండి. నో చెప్పడం నేర్చుకోండి’ అని వెంకటేశ్‌ చెబుతున్న మాటలు యువతను ఆలోచింపచేసేలా ఉన్నాయి. ఆ వీడియోను మీరూ చూడండి.

- Advertisement -