89 శాతం మందికి ఉచిత బియ్యం పంపిణీ: మారెడ్డి

211
89% Free Rice distributed:Mareddy
- Advertisement -

యాసంగిలో ధాన్యం కొనుగోళ్లు చురుగ్గా సాగుతున్నాయని, కొన్ని జిల్లాల్లో కొనుగోళ్ల ప్రక్రియ ముగిసంపు దశకు చేరుకుందని, పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. గత వానాకాలానికి మించి ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందని, వానా కాలంలో 47 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా, ఈ యాసంగిలో ఇప్పటికే 47.97 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ సీజన్‌లో చూసుకున్నా ఇదే అత్యధికమని తెలిపారు.

ఓపీఎంఎస్ సాఫ్ట్ వేర్‌లో నమోదైన వివరాల ప్రకారం ఇప్పటి వరకు 6379 కొనుగోలు కేంద్రాల ద్వారా రూ. 8796 కోట్ల విలువైన 47.97 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందని, ఇందుకు సంబంధించి రూ. 5,537 కోట్ల రూపాయలను రైతు ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు. సోమవారం రూ. 561 కోట్లు, మంగళవారం రూ. 299 కోట్ల విడుదల చేయడం జరిగిందని వివరించారు. గత ఏడాది ఇదే సమయానికి 29.52 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది. నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం, సూర్యాపేట్, మెదక్, సిద్దిపేట్, నిజామాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, జనగామ్, యాదాద్రి, మేడ్చల్ జిల్లాల్లో కొనుగోళ్ల ప్రక్రియ ముగింపుదశకు చేరుకుందన్నారు.

89% మందికి ఉచిత బియ్యం పంపిణీ..

ఈ నెల 1వ తేదీ నుంచి మంగళవారం నాటికి 77.79 లక్షల (89%) మంది కార్డుదారులకు 3 లక్ష 12 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని, 4,044 మెట్రిక్ టన్నుల కంది పప్పును పంపిణీ చేయడం జరిగిందని పౌరసరఫరాల సంస్థ చైర్మన్ శ్రీ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

- Advertisement -