- Advertisement -
భారత్‌లో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతోంది. గత కొద్దిరోజులుగా 10వేల దిగువన పాజిటీవ్ కేసులు నమోదు అవుతున్నాయి. దేశంలో కొత్తగా 8,774 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, గత 24 గంటల్లో 621 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. 9,481 మంది కోలుకున్నారు. కాగా, యాక్టివ్ కేసుల సంఖ్య 543 రోజుల కనిష్ఠానికి చేరింది.
మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,45,72,523కి పెరిగింది. కోలుకున్న వారి సంఖ్య 3,39,98,278గా ఉంది. మొత్తం మృతుల సంఖ్య 4,68,554కు పెరిగింది. ఇప్పటివరకు మొత్తం 63,93,39,125 కరోనా టెస్టులు చేశారు. ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 1,05,691 మంది చికిత్స తీసుకుంటున్నారు.
- Advertisement -