రష్యా.. అమెరికాలను టార్గెట్‌ చేసిన ఇస్రో..

235
Online news Portal
82 Satellites in 1 Rocket: ISRO's Historic Mission
- Advertisement -

అంతరిక్షంలోకి ఇప్ప‌టివ‌ర‌కు ర‌ష్యా ఒకే రాకెట్‌లో 37 ఉప‌గ్ర‌హాల‌ను పంప‌గా, ఆ త‌ర్వాతి స్థానంలో 29 ఉప‌గ్ర‌హాల‌ను ఒకేసారి నింగిలోకి పంపి అమెరికా నిలిచింది. ఆ త‌ర్వాత 20 శాటిలైట్స్‌ను లాంచ్ చేసి భార‌త్ మూడో స్థానంలో నిలిచింది. ఇపుడు రష్యా, అమెరికాల రికార్డులను బద్దలు చేసేందుకు ఇస్రో సిద్దమవుతోంది. ఈ సారి 30 కాదు, 40 కాదు ఏకంగా 82 ఉప‌గ్ర‌హాల‌ను ఒకే రాకెట్‌తో నింగిలోకి పంప‌నుంది. ఈ విష‌యం ఇస్రో అంత‌రిక్ష అనుబంధ సంస్థ ఆంట్రిక్స్ సీఈవో మేనేజింగ్ డైరెక్ట‌ర్ రాకేష్ శ‌శిభూష‌ణ్ ధృవీక‌రించారు.ఇప్ప‌టికే ఓ ప్ర‌యోగానికి సంబంధించి ఇస్రో రూ.500 కోట్లు ఆర్డ‌ర్ ఉండ‌గా తాజాగా మ‌రో రూ.500 కోట్లు రూపాయ‌ల మేర ఆర్డ‌ర్ ఇచ్చిన‌ట్లు ఆయ‌న తెలిపారు.

ఇస్రో ఈ ప్ర‌తిష్టాత్మ‌క ప్ర‌యోగాన్ని వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 15న ప్ర‌యోగించ‌నున్న‌ట్లు మార్స్ ఆర్బిటార్‌ మిషన్‌(మామ్) ప్రాజెక్టు డైరెక్టర్ సుబ్బయ్య అరుణన్ తెలిపారు.ఇస్రో పంప‌నున్న ఉప‌గ్ర‌హాల్లో 60 అమెరికాకు చెందిన‌వి కాగా, 20 యూర‌ప్‌కు 2 యూకేకు చెందిన‌వ‌ని అరుణ‌న్ స్ప‌ష్టం చేశారు. వీటిలో ఇతర దేశాలకు చెందిన నానో ఉపగ్రహాలు ఎక్కువగా ఉన్నాయని వెల్లడించారు. 2020లో మామ్-2ను ప్రయోగించాలని నిర్ణయించినట్లు అరుణన్ వెల్లడించారు. అరుణ గ్రహంపై పరిశోధనలకు ఇప్పటివరకూ 40 ప్రపోజల్స్ వచ్చినట్లు చెప్పారు. చంద్రయాన్-2 2018లో చంద్రునిపై దిగుతుందని తెలిపారు. ఈ మేరకు ఇప్పటికే పరిశోధనలు ప్రారంభమైనట్లు వివరించారు.

rocket_launch_isro_official

కాగా, ఇప్పటివరకూ కేవలం రష్యా మాత్రమే 37 ఉపగ్రహాలను ఒకేసారి విశ్వంలోకి పంపి చరిత్ర సృష్టించింది. 2014లో జరిగిన ఈ ప్రయోగం విజయవంతంకావడంతో రష్యా పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మొగిపోయింది. ఆ తర్వాతి స్ధానంలో అమెరికా 29 ఉపగ్రహాలు, భారత్ 20 ఉపగ్రహాలు ఉన్నాయి. జనవరిలో ఇస్రో చేపట్టే ప్రయోగం విజయవంతమైతే అత్యధిక ఉపగ్రహాలను ఒకేసారి విశ్వంలో పంపిన తొలిదేశంగా భారత్ పేరు చరిత్రకెక్కుతుంది.

ఎన్నో సక్సెస్‌ఫుల్ మిషన్‌లను పూర్తి చేసిన ఇస్రో.. ఈ సారి కూడా పోలార్ శాటిలైట్ లాంచ్ వెహిక‌ల్ (పీఎస్ఎల్‌వీ)ని వినియోగించ‌నుంది. ప్రయోగం జరిగిన 20 నుంచి 25 నిమిషాల్లో 580కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలార్ సన్ సింక్రనస్ కక్ష్యలో 82శాటిలైట్లను ప్రవేశపెడతారు. మొత్తం 1,600 కేజీల బరువును ఇది మోసుకెళ్లగలదు. ఒకేసారి ఎక్కువ ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టడం ఇస్రోకి ఇదే మొదటిసారి కాదు. గతంలో చాలాసార్లు ఇలాంటి ప్రయోగాలను ఇస్రో విజయవంతంగా చేపట్టింది.

- Advertisement -