భారత్ కరోనా అప్‌డేట్..

153
covid
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 8013 కరోనా కేసులు నమోదుకాగా 119 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసులు 4,29,24,130కి చేరగా 4,23,07,686 మంది కరోనా నుండి కోలుకున్నారు.

ప్రస్తుతం దేశంలో 1,02,601 కేసులు యాక్టివ్‌గా ఉండగా 5,13,843 మంది మృతిచెందారు. మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసులు 0.24 శాతంగా ఉండగా రోజువారీ పాజిటివిటీ రేటు 1.11 శాతానికి పడిపోయింది. ఇక దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1,77,50,86,335 కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ చేశామని వైద్యశాఖ వెల్లడించింది.

- Advertisement -