80,039 ఉద్యోగాలకు నోటిఫికేషన్..

86
ts
- Advertisement -

రాష్ట్రంలో 80,039 ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు సీఎం కేసీఆర్. అసెంబ్లీలో కీలక ప్రకటన చేసిన సీఎం…రాష్ట్రంలో 91,ఖాళీలు గుర్తించామని తెలిపారు. మిగితా కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

ఈ ఉద్యోగాల్లో 95 శాతం స్ధానికులకే దక్కనున్నాయన్నారు. ఎన్నో సమస్యలతో నలిగిపోయిన తెలంగాణ నేడు దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. మాకు రాజకీయాలంటే పవిత్రమైన టాస్క్…ప్రజలకు న్యాయం చేయడమే అన్నారు. ఇప్పుడు తెలంగాణ భాష మాట్లాడితేనే హీరో సక్సెస్ అవుతున్నారని తెలిపారు సీఎం. తెలంగాణ భాష, సంస్కృతికి సంబంధించిన వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నామని చెప్పారు.

- Advertisement -