80 ఏళ్ల వరకు చేస్తూనే ఉంటా..

233
Won't Try to Hide Baby Bump on Screen, Says Kareena Kapoor
Won't Try to Hide Baby Bump on Screen, Says Kareena Kapoor

అందం, అభినయంతో ఎంతో మంది అభిమానుల‌ను సొంతం చేసుకున్న బాలీవుడ్ జీరో సైజ్ బ్యూటీ కరీనా కపూర్‌ త్వరలో తల్లి కాబోతున్న విషయం తెలిసిందే. ఈ విష‌యాన్ని కరీనా భర్త సైఫ్‌ అలీ ఖాన్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే, క‌రీనా క‌పూర్ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చాక సినిమాల్లో న‌టిస్తుందా? న‌టిస్తే ఎటువంటి క‌థ‌ల‌ను ఎన్నుకుంటుంది? హీరోయిన్ పాత్ర‌ల‌లో ఎప్ప‌టిలాగే ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తుందా? అనే ప్ర‌శ్న‌లు ఆమె అభిమానులను వెంటాడుతున్నాయి. దీంతో ఈ అమ్మ‌డు తాజాగా స్పందించింది.

పెళ్లి చేసుకొని, పిల్లల్ని కన్నంత మాత్రానా తాను సినిమాలకు దూరం కాబోనని కరీనా స్పష్టం చేసింది. ‘‘నేను అందరిలాగే సాధారణ మహిళలా నా పని నేను చేసుకుంటాను. అందులో ఏం తప్పులేదు కదా! నా పనిని ఇష్టపడతా. నేను నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నటిని అవ్వాలనుకున్నా. అందుకే నేను 80ఏళ్లు వచ్చే వరకు నటిస్తూనే ఉంటా’’ అని చెప్పింది కరీనా.

నెలలు నిండుతున్న త‌న‌ కడుపును వెండితెరపై దాచిపెట్టబోన‌ని కరీనా తెలిపింది. తాను తల్లిని కాబోతున్నందుకు ఎంతో గ‌ర్విస్తున్నాన‌ని చెప్పింది. గ‌ర్భం దాలిస్తే అందులో దాచుకోవడానికి ఏమీలేదని పేర్కొంది. తాను ఏ సినిమా ఎంపిక చేసుకున్నా త‌న‌ను అభిమానులు తానుగానే చూస్తార‌ని చెప్పింది. ప్రస్తుతం తాను కాల్షీట్లపై కసరత్తులు కొన‌సాగిస్తున్న‌ట్లు తెలిపింది. అంతేకాకుండా తనకు ప్రస్తుతం ఎలాంటి పాత్ర ఇచ్చినా చేయగలనని చెప్పింది. తల్లిని కాబోతున్నందుకు చాలా గర్వంగా ఉందని, అందులో దాచుకోవడానికి ఏమీలేదని కరీనా స్పష్టం చేసింది.