సింధూది కర్ణాటకనా?…

242
ML Khattar forgets PV Sindhu's name, calls her 'Karnataka ki beti'
ML Khattar forgets PV Sindhu's name, calls her 'Karnataka ki beti'
- Advertisement -

రియో ఒలింపిక్స్ క్రీడల్లో భారత్‌కు ఒక రజత పతకాన్ని సాధించి పెట్టిన భారత షట్లర్ పీవీ సింధు రాష్ట్రీయతపై వివాదాస్పదం నెలకొంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు సింధు తమ రాష్ట్రం వాసి అంటే.. కాదు తమ రాష్ట్రం వాసి అంటూ పోటీపడీ సన్మానాలు చేశాయి. రూ. కోట్లు ప్రోత్సాహక నగదు బహుమతులు ప్రకటించాయి.

ఇపుడు తాజాగా హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌‌లాల్ ఖట్టర్ సీన్లోకి ఎంటరయ్యారు. సింధు కర్ణాటకకు చెందిన అమ్మాయి అని చెప్పారు. చివరకు ఆమె పేరు కూడా సరిగా పలకలేదు. పీవీ సింధు ఆంధ్రా అమ్మాయా.. తెలంగాణ అమ్మాయా అన్న అనుమానం అక్కర్లేదు. ఆమె కర్ణాటక అమ్మాయి అని ఖట్టర్ తేల్చిపారేశారు.

ఒలింపిక్స్ మహిళల రెజ్లింగ్‌లో కాంస్య పతకం సాధించి రియోలో భారతదేశానికి తొలి పతకం అందించిన సాక్షి మాలిక్‌ను ఆమె సొంత రాష్ట్రం హరియాణాలో ఘనంగా సన్మానించారు. ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఆమెకు రూ. 2.5 కోట్ల పురస్కారం అందించారు. అయితే.. అదే సందర్భంలో పీవీ సింధు విషయంలో మాత్రం ఆయన మాట తడబడ్డారు. సింధును కర్ణాటకకు చెందిన అమ్మాయి అని చెప్పారు. చివరకు ఆమె పేరు కూడా సరిగా పలకలేదు.

వరుసపెట్టి టెన్నిస్, షూటింగ్, బ్యాడ్మింటన్.. ఇలా చాలా క్రీడల్లో ఒక్క పతకం కూడా రాక భారతీయులంతా తీవ్ర నిరాశలో మునిగిపోయిన తరుణంలో సాక్షి మాలిక్ దేశానికి మొట్టమొదటి పతకం అందించింది. రియో నుంచి తిరిగి వచ్చిన ఆమెకు ఢిల్లీలోను, తర్వాత హరియాణాలోను కూడా ఘన స్వాగతం లభించింది.

- Advertisement -