ఓటీటీలోకి ..’8 వసంతాలు’!

7
- Advertisement -

పాన్ ఇండియా టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ లేటెస్ట్ హార్ట్ వార్మింగ్ బ్లాక్ బస్టర్ ‘8 వసంతాలు’. ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనంతిక సనీల్‌కుమార్ లీడ్ రోల్ పోషించారు. నవీన్ యెర్నేని , వై. రవిశంకర్ నిర్మించారు. జూన్ 20న వరల్డ్ వైడ్ విడుదలైన ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంది.

తాజాగా ఈ చిత్రం ఓటీటీ డేట్ లాక్ అయింది. ప్ర‌ముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం జూలై 11 నుంచి తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళం భాష‌ల్లో స్ట్రీమింగ్ కానుంది.

శుద్ధి అయోధ్య (అనంతిక సనీల్ కుమార్) పదిహేడు ఏళ్లకే ఓ పుస్తకం రాసి పేరు తెచ్చుకుంటుంది. అనంత‌రం క‌రాటేలో కూడా ప్రావీణ్యం సంపాదిస్తుంది. ర‌చ‌న‌లు, ట్రావెలింగ్, మార్షల్ ఆర్ట్స్‌తో గ‌డుపుతున్న ఆమె జీవితంలోకి వ‌రుణ్ (హ‌ను రెడ్డి) అనే వ్య‌క్తి ప్ర‌వేశిస్తాడు. దీంతో కొన్నిరోజుల‌కే ఇద్ద‌రు ప్రేమ‌లో ప‌డ‌తారు. శుద్ధికి వ‌రుణ్ ప్ర‌పోజ్ చేయ‌గా.. త‌న‌కు స‌మ‌యం కావాల‌ని కోరుతుంది. ఈ క్ర‌మంలో అత‌డు విదేశాల‌కు వెళ‌తాడు. అయితే వ‌రుణ్ విదేశాల‌కు వెళ్లిపోయిన త‌ర్వాత శుద్ధి జీవితంలోకి సంజ‌య్ (ర‌వి దుగ్గిరాల) అనే వ్య‌క్తి ఎంట‌ర్ అవుతాడు. అస‌లు ఈ సంజ‌య్ ఎవ‌రు.? శుద్ధి – వ‌రుణ్‌లు క‌లుస్తారా? అనేదే సినిమా కథ.

Also Read:చర్చకు వచ్చే దమ్ము లేదు: కేటీఆర్

- Advertisement -