రాష్ట్రంలో మరో 8 మెడికల్ కాలేజీలు..

40
- Advertisement -

తెలంగాణ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 5 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన కేబినెట్ సమావేశ వివరాలను మీడియాకు వెల్లడించారు మంత్రి కేటీఆర్.వరద నష్టంపై క్యాబినెట్ లో చర్చించామని…తక్షణ సాయంగా రూ.500 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. రోడ్లకు తక్షణం మరమ్మతులు చేపట్టాలని తెలిపారు.

విద్యుత్ వీరులకు 15 ఆగస్టున సత్కారం చేయనున్నామని తెలిపిన కేటీఆర్…టీఎస్ ఆర్టీసీ కార్మికులకు శుభవార్తను అందించారు.ప్రజా రవాణా ను మరింత మెరుగుపర్చేందుకు టీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంతో 43వేల 373 మంది ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు పొందనున్నారు. ఇక దీనికి సంబంధించిన కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయనున్నామని..రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ప్రవేశ పెట్టనున్నట్లు చెప్పారు.

Also Read:KTR:ప్రభుత్వంలో టీఎస్‌ఆర్టీసీ విలీనం

హైదరాబాద్ కీలక రూట్లలో మెట్రో విస్తరించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. మూడు నాలుగేళ్లలో పూర్తిచేయాలని..అలాగే గవర్నర్ తిప్పి పంపిన బిల్లులను అసెంబ్లీ సమావేశాలు లో తిరిగి తీర్మానం చేసి పంపుతాం అన్నారు. రెండోసారి తీర్మానం చేసి పంపిన బిల్లులను గవర్నర్ ఆమోదించక తప్పదన్నారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలు గా ఎస్టీల నుంచి కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రావణ్ ల ను గవర్నర్ కు ప్రతిపాదిస్తూ కేబినెట్ తీర్మానం చేసిందన్నారు.

వరంగల్ పట్టణంలో ఎయిర్ పోర్టు కు అదనపు భూమి 253 ఎకరాలు కేటాయిస్తూ కేంద్ర పౌర విమానయాన శాఖ కు పంపాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. హైదరాబాద్ కు మరో ఎయిర్ పోర్టు అవసరం ఉందన్నారు. హైదరాబాద్ లో హాకింపేట ఎయిర్‌పోర్టును గోవా తరహాలో పౌర విమానయాన సేవలు ప్రారంభించాలని కేంద్రాన్ని కోరతూకేబినెట్ తీర్మానించిందన్నారు. అలాగే మరొక 8 మెడికల్ కాలేజీల ఏర్పాటు,రైతులు, హైదరాబాద్, వరంగల్ అభివృద్ధి పై చర్చించామన్నారు. వర్షాలు, వరదలు పట్ల అప్రమత్తంగా ఉండాలని….పంట నష్టం పై పూర్తి నివేదిక అందాక నిర్ణయం తీసుకుంటామన్నారు. కేంద్రం కూడా రాజకీయం చేసుడు బంద్ చేసి, సహాయం చేయాలన్నారు.

Also Read:మహారాష్ట్రకు సీఎం కేసీఆర్

- Advertisement -