సికింద్రాబాద్‌లో అగ్నిప్రమాదం..8 మంది మృతి

64
talasani
- Advertisement -

సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఎలక్ట్రిక్‌ బైక్ షోరూంలో అగ్నిప్రమాదం జరుగగా 8 మంది మృతిచెందారు. పై అంతస్తులో ఉన్న రూబీ లాడ్జిపైకి మంటలు ఎగసిపడగా ఊపిరాడక వారంతా మృతిచెందారు. ఇక గాయపడిన వారిని యశోద, గాంధీ ఆస్పత్రికి అధికారులు తరలించారు.

ప్రమాద సమయంలో లాడ్జిలో 25 మంది ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతుల్లో ఒక మహిళ ఉండగా సెల్లార్‌లో నిబంధనలకు విరుద్ధంగా షోరూం నిర్వహిస్తున్నందుకు రంజిత్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు.

ఈ ప్రమాదంపై స్పందించిన ప్రధాని.. ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అలాగే వారి కుటుంబాలకు రూ.2 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ప్రమాదంలో గాయపడిన వారికి రూ.50 వేలు పరిహారం ఇస్తామని వెల్లడించారు.

- Advertisement -