ఆసక్తి రేపుతున్న “సవ్యసాచి” ట్రైలర్

351
- Advertisement -

“ప్రేమమ్” మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అక్కినేని నాగచైతన్య తాజా చిత్రం “సవ్యసాచి”. చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది. ప్రతినాయకుడిగా మాధవన్, చైతూ అక్కగా భూమిక కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం నవంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. మూవీలోని ప్రధాన పాత్రలను కవర్ చేస్తూ, లవ్, కామెడీ, ఎమోషన్, యాక్షన్ సీన్స్‌పై ఈ ట్రైలర్ రిలీజ్ చేశారు.

ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. టాలీవుడ్‌లో ఇప్పటి వరకు రాని సరికొత్త కథాంశంతో తెరకెక్కుతున్న “సవ్యసాచి”లో చైతూ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.  ఈ మూవీకి సంబంధించి ఇదివరకే విడుదలైన పోస్టర్స్, టీజర్స్ సినీ అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. తాజాగా విడుదలైన “సవ్యసాచి” ట్రైలర్ సోషల్  మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఇక మీరు కూడా ఓ లుక్కేయండి..

- Advertisement -