రాబోయే జనరేషన్‌ ఆక్సీజన్‌ కొనుగోలు చేయకూడదు : సరయు

62
sarayu
- Advertisement -

ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ఇండియా ఛాలెంజ్ జోరుగా కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రముఖులు పాల్గొంటూ వారితో పాటు మరి కొందరిని నామినెట్‌ చేస్తూ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమాన్ని విస్తరిస్తున్నారు. తాజాగా బిగ్‌బాస్‌ ఫేమ్‌, 7ఆర్ట్స్ సరయు జూబ్లీహీల్స్‌లోని జీహెచ్‌ఎంసీ పార్క్‌లో మొక్కలు నాటి మరో ముగ్గురిని నామినెట్‌ చేశారు.

ఈ సందర్భంగా సరయు మాట్లాడుతూ… గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటితే రాబోయే జనరేషన్ లో ఆక్సీజన్ కొనుక్కునే పరిస్థితి రాదన్నారు. పర్యావరణ పరిరక్షణ మన బాధ్యత అని చెప్పారు. ఇంత మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు ఎంపీ సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. సరయు మరో ముగ్గురిని మొక్కలు నాటాలని ఛాలెంజ్‌ చేశారు. వారు 7 ఆర్ట్స్ డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి, కుమారి 21F డైరెక్టర్ సూర్య ప్రతాప్, బిగ్ బాస్ విశ్వ మొక్కలు నాటాలని కోరారు.

- Advertisement -