77 ఏళ్ల దేవదాసు..

473
akkineni devadas
- Advertisement -

భారతీయ సినీ చరిత్రలో ఎన్ని సినిమాలు వచ్చినా దేవదాసు చిత్రానికి ఉండే ప్రత్యేకత వేరు. 1950వ దశకంలో వచ్చిన ఈ సినిమా చరిత్ర సృష్టించింది. తెలుగులో ఆల్ టైమ్ హిట్ సినిమాల్లో ఒకటిగా నిలిచిన ఈ మూవీని తర్వాత అనేక భాషల్లో తెరకెక్కించారు.

అయితే దేవదాసు అంటే అక్కినేని నాగేశ్వరరావు, పార్వతి అంటే సావిత్రిలా నటించి మెప్పించలేకపోయారు. హిందీలో ఇదే సినిమాను దిలీప్‌కుమార్‌తో తీస్తే, అక్కినేనిలా నేను నటించలేకపోయాను. ఆయనలా దగ్గలేకపోయాను అన్నారట.

శరత్‌చంద్ర ఛటోపాధ్యాయ నవలను తెలుగులోకి అనువదించి డీఎల్‌ నారాయణ ఈ సినిమాను నిర్మించారు.1953లో విడుదలైన ఈ చిత్రం పేరుతో ఇప్పటికి సినిమాలు వస్తున్నాయంటే దేవదాసు చిత్రం ఏరేంజులో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిందో అర్ధం చేసుకోవచ్చు.

ఈ సినిమాకు హీరోగా అక్కినేనిని ఎంపిక చేస్తే ఆయన పనికిరారని, తీసేయ్యమని చాలామంది నిర్మాతలు డీఎల్‌ నారాయణ, దర్శకుడు వేదాంతం రాఘవయ్యలకు సలహా ఇచ్చారట. కానీ, ఎవర్నీ లెక్క చెయ్యకుండా అక్కినేనితోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ నమ్మకాన్ని నిజంచేస్తూ నభూతో నభవిష్యతి అన్నట్లుగా అక్కినేని తన నటనతో వెండితెరను షేక్ చేశారు.

ముఖ్యంగా జగమే మాయ బ్రతుకే మాయ అనే పాట ఇప్పటికి ప్రేమలో ఫెయిల్‌ అయినవారికి ఫేవరేట్ సాంగ్‌. ఈ పాటను అక్కినేని నిజంగా తాగి చేశారని అప్పట్లో బయట చెప్పుకొనేవారు. కానీ రాత్రిపూట షూటింగ్ కావడంతో నిద్రకు కళ్లు మూతలు పడుతుంటే నిజంగా అక్కినేని తాగినట్లే తెరపై కనిపించేవారట.

రచయిత శరత్ చంద్ర ఛటర్జీ వ్రాసిన దేవదాసు నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ప్రేమ విఫలమై తర్వాత అదే ప్రేమకోసం ఇద్దరు చనిపోయే నేపథ్యంగా తెరకెక్కిన ఈ చిత్రం ఎప్పటికి ఎవర్‌గ్రీన్ మూవీనే. అన్ని భారతీయ భాషలలో కలసి దాదాపు 10 సార్లు ఈ సినిమా విడుదల అయినా నాగేశ్వరరావు దేవదాసుగా నటించిన ఈ చిత్రానికి వచ్చినంత పేరు మరే దేవదాసు చిత్రానికీ రాలేదు. 1974లో కృష్ణ దేవదాసుగా నటించిన సినిమా విడుదలై 50రోజులు ఆడీతే, అదే సమయంలో మళ్ళీ విడుదలైన నాగేశ్వరరావు దేవదాసు 200 రోజులు ఆడింది.

- Advertisement -