కాంగ్రెస్ నేతలది బానిస మనస్తత్వం- హరీష్ రావు

444
- Advertisement -

కాంగ్రెస్ పార్టీ రూపొందించిన మేనిఫెస్టో నచ్చకనే దామోదర రాజనర్సింహ భార్య పద్మినీరెడ్డి పార్టీ మారిందని మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలది బానిస మనస్తత్వమని.. ప్రజల మనోభావాలను కాంగ్రెస్ గుర్తించడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే యాదాద్రి థర్మల్ ప్లాంట్ మూసేస్తామంటున్న మాటలు కోమట్ రెడ్డి వెంకటరెడ్డివా.. లేక కాంగ్రెస్ పార్టీ స్టాండా..? స్పష్టం చేయాలని ఆయన నిలదీశారు.

ఇదిలా ఉంటే.. పద్మినీరెడ్డి బీజేపీలో చేరడంపై సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ ఉదయం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సమక్షంలో పద్మినీరెడ్డి కమలం కండువా కప్పుకున్నారు. అయితే ఆమె కాంగ్రెస్ తరపున సంగారెడ్డి టికెట్ ఆశింనట్లు సమాచారం. సంగారెడ్డి టికెట్ జగ్గారెడ్డికి కాంగ్రెస్ కేటాయించడంతో పద్మినీరెడ్డి మనస్థాపానికి గురైనట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.

- Advertisement -