‘హలో గురు ప్రేమకోసమే’ ప్రీ రిలీజ్..?

259
- Advertisement -

రామ్, అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్స్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘హలో గురు ప్రేమకోసమే’ ఈ సినిమా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రూపొందిస్తుండగా దిల్‌ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రొమాంటిక్ లవ్ స్టోరీగా నిర్మితమైన ఈ సినిమా నుండి ఇదివరకే విడుదలైన టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది.

Hello Guru Prema Kosame

యూత్‌కి కనెక్ట్ అయ్యే అంశాలు కావాల్సినన్ని వున్నాయనే టాక్ వచ్చింది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్ర బృందం.ఈ నెల 13వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఫిల్మ్ నగర్‌లోని జెఆర్సీ కన్వెన్షన్‌లో ఈ వేడుకను నిర్వహించనున్నారు.

దసరా సెలవులు కావడంతో ఈ సినిమా థియేటర్ల దగ్గర గట్టిగానే సందడి చేసే ఛాన్స్ ఉందని చెప్పుకుంటున్నారు. ఈ ఏడాది రెండు సినిమాలతో నష్టాలపాలైన దిల్ రాజు, ఈ సినిమాతో లాభాలు రాబడతాడేమో చూడాలి. దసరా పండుగ సందర్భంగా ఈ నెల 18వ తేదీన భారీస్థాయిలో విడుదల చేయనున్నారు.

- Advertisement -