72 శాతం తిరిగిన బస్సులు…

329
rtc
- Advertisement -

ఆర్టీసీ అధికారుల ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో ప్రయాణీకుల ఆటంకాలు తొలగాయి. హైదరాబాద్‌లో సిటీ సర్వీసుల్ని క్రమంగా పెంచుతూ ప్రయాణ సౌకర్యాన్ని మరింత మెరుగుపరుస్తోంది. వివిధ అవసరాల నిమిత్తం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతంకు చేరుకోవడానికి ప్రయాణించే బస్సులను సాధ్యమైనంత వరకు అందుబాటులో ఉంచడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు.

నగరవాసులు బస్సుల కోసం వేచిచూసే పరిస్థితి లేకుండా అన్ని సర్వీసుల్ని తాత్కాలిక సిబ్బందితో తిప్పడానికి తగిన చర్యలు తీసుకుంటుండంతో ప్రయాణ ఇక్కట్లు తొలగిపోయాయి. ప్రధాన బస్టాండ్స్‌లో బస్సుల సమాచారాన్ని తెలియజేస్తుండటంతో ఆయా ప్రాంతాల నుంచి తమ గమ్యస్ధానాలకు చేరుకునే ప్రయాణీకులు ఎలాంటి ఆటంకాలు లేకుండా వెళ్లగలుగుతున్నారు.

బుధవారం 11 రీజియన్‌లలో ఎక్కువ మొత్తంలో సర్వీసుల్ని నడిపారు. 72.46 శాతం బస్సులు నడిచినట్లు గణాంకాలు చెబుతున్నాయి. సాయంతరం 5 గంటల వరకు 1937 అద్దె బస్సుల్ని కలుపుకుని మొత్తం 6484 బస్సులు నడిచాయి. తాత్కాలిక డ్రైవర్స్ – 4547,తాత్కాలిక కండక్టర్స్ -6484తో ఆయా సర్వీసుల్ని ప్రయాణీకులకు అందుబాటులో ఉంచారు. 5660 బస్సుల్లో టిమ్స్‌ ద్వారా 283 బస్సుల్లో టికెటింగ్ విధానం కొనసాగించారు.

- Advertisement -