గాలి జనార్థన్ రెడ్డికి ఏడేళ్ల జైలు శిక్ష

13
- Advertisement -

ఓబులాపురం మైనింగ్ కేసులో సీబీఐ కోర్టు తుది తీర్పు వెలువరించింది. ఏ2 గాలి జనార్థన్ రెడ్డిని దోషిగా తేల్చింది. దీంతో పాటు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. మొత్తం ఐదుగురుని దోషులుగా తేల్చింది న్యాయస్థానం. మొత్తం ఈ కేసులో 9 మంది ఉండగా కృపానందం, సబితా ఇంద్రారెడ్డిని నిర్దోషులుగా తెలిపింది న్యాయస్థానం.

14 ఏళ్ల తర్వాత తుది తీర్పు వెలువరించింది సీబీఐ కోర్టు. నిబంధనలకు విరుద్ధంగా ఓఎంసీ అక్రమంగా తవ్వకాలు జరిపిందని ఆరోపణ వచ్చాయి. ఓఎంసీలో మైనింగ్ కార్యకలాపాలను నిషేధిస్తూ అప్పటి రోశయ్య ప్రభుత్వం జీవో. 71 విడుదల చేసింది.

2011లో మొదటి చార్జిషీటు దాఖలు చేసింది సీబీఐ. రూ.884. కోట్ల ప్రజాధనం లూటీ చేశారని సీబీఐ అభియోగాలు మోపగా 219 మంది సాక్షులను విచారించి, 3,400 డాక్యుమెంట్లలతో చార్జ్ షీట్ దాఖలు చేశారు.

Also Read:కేసీఆర్‌ని దూషిస్తే నాలుక చీరేస్తా?:కేటీఆర్

- Advertisement -